సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు.
కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్‌లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్‌ల యాజమాన్యం స్పష్టం చేశారు.
ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.
చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య..
Comments
Please login to add a commentAdd a comment