సాక్షి,జగిత్యాల: రైతు సీఎం కేసీఆర్ అయితే,బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడారు.
‘ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండు కాబట్టే పాదయాత్ర చేపట్టిండు. ధాన్యం దళారుల పాలైపోయింది. రూ.500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్‌తో కలిపి 2820 రూపాయలు క్వింటాలుకు అందాల్సి ఉంటే పద్దెనిమిది,పందొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటున్రు.వడ్లు కొన్న 24 గంటల్లో పైసలు పడాలని నాడు కేసీఆర్ చెబుతుండే.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలెక్కువ,పని తక్కువ. ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం చేసిన్రు, రైతుబంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన్రు. ఈ సర్కారు వచ్చాక ఒక్క విడత కూడా రైతుబంధు పడలే. దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్లు రాసిచ్చిండు.
పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒట్లు పెట్టిండు రేవంత్. రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నడు. రుణమాఫీ అయిందా..?రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతుల మిత్తీ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.
రైతుబంధుకు, రుణమాఫీకి డబ్బుల్లేవంటగానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్ల ఖర్చు పెడతానంటుండు రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్‌ది. మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే..రేపు ముందర ఉంది 70 ఎంఎం సినిమా.జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా దండోరా ప్రకటించాం’అని హరీశ్‌రావు అన్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీలో హీట్.. ఇటు కేటీఆర్..అటు రేవంత్.. గవర్నర్ కూడా
Comments
Please login to add a commentAdd a comment