సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఉన్నది ఖాకీ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగినన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదడని.. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు.
జగిత్యాల జైలులో ఉన్న హబ్సీపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ గంగారెడ్డిని ఎమ్మెల్సీ కవిత గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్ఛి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.
యూనివార్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
చదవండి: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment