
మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి
రాయికల్(జగిత్యాల): బీఆర్‌ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి, విస్మరించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు అన్నవేని వేణు, ఎంపీటీసీ సభ్యుడు ఆకుల మహేశ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్, నాయకులు తిరుపతినాయక్, పర్శరాం, సాయిరాజ్‌గౌడ్, నర్సయ్య, ఆకుల శేఖర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment