కోరుట్ల రూరల్: రోడ్డు ప్రమాదంలో రాయికల్ మండలంలోని మైతాపూర్‌కు చెందిన వల్లకొండ జమున (57) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జమున పని నిమిత్తం శుక్రవారం కుమారుడు సుధాకర్ గౌడ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై కోరుట్లకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో జోగిన్‌పెల్లి శివారులోకి రాగానే ఆమె చీరకొంగు బైక్ వెనుక టైరుకు చుట్టుకుంది. ఈ ఘటనలో ఆమె కిందపడి, తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికు మారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment