
వేడుకుంటున్న పాప తండ్రి నరేష్
బుగ్గారం(ధర్మపురి): 45 రోజుల పసిపాప.. పాల కోసం గుక్కపట్టి ఏడుస్తోంది.. కానీ తల్లి పాలు పడుతుంటే తాగలేకపోతోంది.. ఆందోళన చెందిన ఆ తల్లిదండ్రులకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల జబ్బు, గొంతువాపుగా తేలింది. తల్లిదండ్రులు తాము కూడబెట్టుకున్న డబ్బులన్నీ వైద్యానికి ఖర్చు చేశారు. ఇక చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బుగ్గారం మండంలోని సిరికొండ గ్రా మానికి చెందిన గజ్జెల నరేష్–రజిత దంపతులది నిరుపేద కుటుంబం.
ఇద్దరూ వ్యవసాయ కూలీలు. వీరికి 45 రోజుల పాప నాగలక్ష్మి ఉంది. కూతురు పుట్టిందన్న సంతోషిస్తున్న సమయంలో ఒక్కసారిగా వారి జీవితంలో కుదుపు. పాప పాల కోసం ఏడుస్తోంది.. కానీ తాగలేకపోతోంది. త ల్లిదండ్రులు తొలుత జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా గొంతువాపుతోపాటు ఊపిరితి త్తుల జబ్బు ఉందని వైద్యులు తెలిపారు. గత జనవరిలో 10 రోజులు చికిత్స పొందగా కొంత నయమవడంతో ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఈ నెలలో సమస్య తీవ్రమైంది. 20వ తేదీన ఆస్పత్రిలో చేర్పించారు.
హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు..
పాప ఆరోగ్యం బాగుపడటం కోసం నరేష్–రజిత దంపతులు పైసా పైసా పోగేసుకున్న రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం అప్పు చేసి, నాగలక్ష్మికి వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నారు. వైద్యులు మరో రూ.4 లక్షలు కావాలన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లమంటున్నారని, చేతిలో చిల్లిగవ్వ లేదని ఆ దంపతులు విలపిస్తున్నారు. దాతలు స్పందించి, తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
దాతలు సంప్రదించాల్సిన అడ్రస్..
బ్యాంక్ అకౌంట్ నంబర్ : 200422010024976
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : టీఎస్‌ఏబీ0020004
బ్రాంచి: కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో–ఆపరేటివ్
సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, ధర్మపురి
ఫోన్ నంబర్ : 95735 07907
(మోతె కరుణాకర్, పాప మేనమామ,
ఫోన్ పే, గూగుల్ పే).

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment