
మాట్లాడుతున్న వెంకటరాంబాబు
జగిత్యాలటౌన్: యువత అన్ని రంగాల్లో ముందుండి, దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని నెహ్రూ యువకేంద్రం డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకటరాంబాబు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ అనే అంశంపై యువతకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధికంగా యువతను కలిగి ఉన్నది మన దేశమేనని గుర్తు చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సమాజంలో వస్తున్న మార్పులు, అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటాసైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జీ20 దేశాలకు మన దేశం అధ్యక్షత వహించనుండటం హర్షణీయమని పేర్కొన్నారు. విపత్తుల సమయంలో యువత దేశానికి అండగా నిలిచేందుకు సన్నద్ధంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌వైకే యువజన వలంటీర్ చింత అనిల్, రాపాక సాయి, మనవాడ నందు, పాదం మహేందర్, లవకుమార్, సాయికిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment