సాక్షి, జగిత్యాల జిల్లా: దసరా వేడుకలకు అటవీశాఖ కార్యాలయాలన్నే బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసిన అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దసరాకు ఒక రోజు ముందు నుంచే కార్యాలయంలో మందు పార్టీతో పాటు, అడవి జంతువుల మాంసంతో అధికారులు విందు చేసుకున్నారు. చిత్రీకరిస్తున్న మీడియాపైనా అధికారులు చిందులు తొక్కారు మీడియా కథనాలతో అటవీ శాఖ అధికారులు స్పందించారు.
విచారణ చేపట్టిన అటవీశాఖ.. జగిత్యాల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్‌తో పాటు, ముత్యంపేట బీట్ ఆఫీసర్ సాయిరాంపై సస్పెన్షన్ వేటు వేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వాచర్ లక్ష్మణ్‌ను విధుల నుంచి తొలగించింది.
ఇదీ చదవండి: TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment