సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా వాసులకు తీపి కబురు అందింది. జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కల సాకారం కాబోతోంది. వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి 150 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభించబోయే జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు లేఖ రాసింది. లేబొరేటరీ, లైబ్రరీ, ఫ్యాకల్టీ, నర్సింగ్, పారామెడికల్ స్టాఫ్, హాస్టళ్లు తదితర వసతి సౌకర్యాలు ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లా వాసులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. (క్లిక్: పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి)
Comments
Please login to add a commentAdd a comment