ముహూర్తం ఎప్పుడో? | When starts | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఎప్పుడో?

Published Fri, Sep 2 2016 7:40 PM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM

మెడికల్‌ కళాశాల - Sakshi

మెడికల్‌ కళాశాల

– మొదటి సంవత్సర తరగతులకు అనుమతి  
– మెడికల్‌ కళాశాల, ఆస్పత్రి వైద్యాధికారులు సిద్ధం
– ఎంసీఐ మూడో విజిట్‌ కోసం ఎదురుచూపులు
 వారంరోజుల నుంచి ఈరోజు.. రేపు అంటూ ఒక్కటే ఉత్కంఠ.. ఎంసీఐ విజిట్‌ కోసం మెడికల్‌ కళాశాల అధికారులు.. జిల్లా ఆస్పత్రి వైద్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. మరోవైపు ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది.
 మమబూబ్‌నగర్‌ క్రైం : ఎంసీఐ విజిట్‌ కోసం అవసరమైన ఏర్పాట్లతో పాటు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చారు. కళాశాల నిర్వహణకు ఒకవైపు వైద్యులతోపాటు సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ చేశారు. మరోవైపు ల్యాబ్‌ పరికరాలు, ఫర్నిచర్, పుస్తకాలు ఇలా ప్రతి ఒక్కటీ కళాశాలకు చేరుకున్నాయి. అయితే మెడికల్‌ కళాశాలను విజిట్‌ చేసి అనుమతి మంజూరు చేయాల్సిన ఎంసీఐ బందం మాత్రం రావడంలేదు. గత నెల 28నుంచి 31వ తేదీ మధ్య వస్తున్నారని ప్రచారం జరిగింది. ఇంతవరకు వారు రాకపోవడంతో అసలు ఎప్పుడు వస్తారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏ సమయంలోనైనా కళాశాలను ఆకస్మికంగా విజిట్‌ చేస్తారనే ఉద్దేశంతో స్థానికంగా పనిచేసే వైద్యుల నుంచి సిబ్బంది వరకు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
 
 
ఇప్పటికే రెండుసార్లు పరిశీలన
 ఇప్పటికే రెండుసార్లు పరిశీలించిన బందం చివరగా మూడోసారి వచ్చి కళాశాల నిర్వహణకు ముఖ్యమైన సౌకర్యాలు కల్పించారో.. లేదో చూడాల్సి ఉంది. గతంలో నిర్వహించిన ఎంసెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల పాలమూరు మెడికల్‌ కళాశాల ప్రారంభానికి ఆలస్యమైంది. అయితే ఇప్పటికే ఎంసీఐ నుంచి జిల్లా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించుకోవడానికి అనుమతి లభించింది. ప్రస్తుతం ఎంసెట్‌ పరీక్ష నిర్వహించి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత కానీ కళాశాల ప్రారంభమయ్యే అవకాశం కనిపించడంలేదు. దీనికి రెండు నెలల సమయం పట్టే అవకాశముంది.
 
వైద్యులు, సిబ్బంది నియామకం
పాలమూరు వైద్య కళాశాల కోసం 462పోస్టులను మంజూరు చేశారు. దీంట్లో 75మంది వైద్యులను ఎంపిక చేశారు. దీంట్లో 200మంది వైద్యులు, 200నర్సింగ్‌ సిబ్బంది, 64మంది పారామెడికల్‌ సిబ్బంది ఉంటారు. ఇటీవల జూనియర్, సీనియర్‌ వైద్యులు, టూటర్స్‌ కలుపుకొని మొత్తం 60మందిని నియమించారు. ఈ జిల్లాకు ఐదునెలల క్రితమే మెడికల్‌ కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల భవన నిర్మాణానికి రూ.450కోట్లు మంజూరు చేయగా ఎదిర శివారులో 75ఎకరాలను కేటాయించింది. అయితే ఆగస్టు నుంచే విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వంద పడకల భవనంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.
 
 
మెడికల్‌ కళాశాలలో సౌకర్యాలు
 మెడికల్‌ కళాశాలలో అత్యంత ముఖ్యమైన ల్యాబ్‌లకు సంబంధించిన పరికరాలు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అనాటమీ, మైక్రోబయాలజీ, ఇతర ల్యాబ్‌ పరికరాలు వచ్చాయి. వాటన్నింటినీ స్థానిక గదుల్లో భద్రంగా ఉంచారు. విద్యార్థులకు తరగతులు బోధన చేయడానికి అవసరమైన బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు తీసుకొచ్చారు. మొత్తం 150మంది విద్యార్థులకు ఐదు గదులను ఏర్పాటుచేశారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌గా చూపించడానికి వైద్యులు మానవ అస్థిపంజరాలను అందుబాటులో ఉంచారు. ల్యాబ్‌ నిర్వహణకు కొత్త పరికరాలతోపాటు మిషన్లు ఏర్పాటుచేశారు. 
 
 
వారం రోజుల్లో రావచ్చు
 మెడికల్‌ కళాశాలను విజిట్‌ చేయడానికి వారం రోజుల్లో ఎంసీఐ బందం రావచ్చు. వారి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. బందం వచ్చి వెళ్లిన తర్వాత ఎంసెట్‌ పూర్తిన వెంటనే ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తాం.
– అశోక్‌రెడ్డి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement