జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ | PM Modi Vijaya Sankalpa Sabha At Jagtial Updates | Sakshi
Sakshi News home page

జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ.. అప్‌డేట్స్‌

Published Mon, Mar 18 2024 10:26 AM | Last Updated on Mon, Mar 18 2024 3:27 PM

PM Modi Vijaya Sankalpa Sabha At Jagtial Updates - Sakshi

ప్రధాని మోదీ జగిత్యాల పర్యటన.. బహిరంగ సభ అప్‌డేట్స్‌

ప్రధాని మోదీ కామెంట్స్..

  • భారత్ వికాసంతో తెలంగాణా వికాసం కూడా సులభమైతుంది.
  • మూడురోజుల్లో మూడుసార్లు తెలంగాణా వచ్చాను.
  • వందల కోట్ల రూపాయలు తెలంగాణా వికాసం కోసం కేంద్రం కేటాయిస్తున్నాం.
  • తెలంగాణాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసే లేదిప్పుడు.
  • తెలంగాణాతో పాటు, దేశం మొత్తం మళ్ళీ బీజేపీ కావాలని కోరుతోంది.
  • సమృద్ధ భారత్ కోసం 400 సీట్లు దాటాలి.
  • అందుకే బీజేపీకే ఓటు వేయాలి.
  • శక్తి స్వరూపిణిలైన ఇంతమంది స్త్రీలు, యువత ఆశీర్వచనం ఇచ్చేందుకు వచ్చారంటే.. నేనెంత అదృష్టవంతుణ్ని!.
  • నేను భారతమాత పూజారిని.
  • ఇండియన్ అలయెన్స్‌కు నామారూపాల్లేకుండా చిత్తు చేసేందుకు ఈ నారీశక్తి అంతా ఒక్క తాటిపైకి రావాలి.
  • చంద్రయాన్ సఫలీకృతం కావడంలో కూడా ఈ నారీశక్తిది కీలకపాత్ర.
  • శక్తి వినాశనాన్ని కోరుకునే వారికి ఇక్కడ స్థానం లేదు, వారిని తుదముట్టించాలి.
  • తెలంగాణా ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజా ఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు.
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కు తెలంగాణా ఏటీఎం కార్డులా మారింది.
  • తెలంగాణాను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూదొందే.
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.
  • అందుకే కాళేశ్వరంకు సంబంధించి ఎలాంటి చర్యల్లేవ్.
  • ఆ రెండు పార్టీలు  మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయి.
  • మోదీ తెలంగాణా ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాడు.. తెలంగాణాను దోచుకునే వారినెవరినీ వదిలిపెట్టడని.
  • కాంగ్రెస్ కాదది స్కాంగ్రెస్.
  • ఢిల్లీలో లిక్కర్ స్కాంతో ఇక్కడి బీఆర్ఎస్ ఏం చేసిందో చూశారు.
  • కాబట్టి ఆ రెండు పార్టీలను గెలిపిస్తే అంతే సంగతులు.
  • మీరెన్ని సీట్లలో తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే తెలంగాణాలో అంత అభివృద్ధి జరుగుతుంది.
  • వికసత్ తెలంగాణా కావాలంటే బీజేపీని అత్యంత మెజారిటీతో అన్ని సీట్లలో గెలిపించాలి

కిషన్‌రెడ్డి ప్రసంగం.. 

  • మోదీ పాలనలో భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోంది
  • 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు
  • రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు
  • ఆర్టికల్ 370 నుంచి మొదలుపెడితే.. రామమందిర నిర్మాణం వరకు సుస్థిర పాలన
  • రామగుండం ఎరువుల పరిశ్రమ, జాతీయ రహదారులు, పసుపు బోర్డు, గ్రామపంచాయతీ నిధులివ్వడం.. వీటన్నిటినీ మోడీ ప్రభుత్వం ఎంత అంకితభావంతో చేస్తుందో చూస్తున్నాం
  • సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చింది మోదీనే
  • ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది
  • కాళేశ్వరం, లిక్కర్, దళితబంధు, భూ కేటాయింపుల పేరిట దోపిడీలకు పాల్పడింది
  • కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాంతో తెలంగాణా రాష్ట్రాన్ని తలదించుకునేలా చేసింది
  • కుక్క తోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తీరుతుంది
  • ఆరు గ్యారంటీలని చెప్పి వాటిని అమలు చేయని కాంగ్రెస్ ఇక్కడవసరమా..?
  • అందుకే మళ్లీ మోదీని మూడోసారి ప్రధానిని చేసుకోవాల్సిన అవసరముంది.

జగిత్యాల: అర్వింద్ కామెంట్స్

  • ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ మోదీ
  • భారత దేశం సురక్షింతంగా ఉండాలంటే మోదీ మూడోసారి ప్రధాని కావాలి

  • జగిత్యాలలో ప్రారంభమైన బీజేపీ విజయ సంకల్ప సభ
  • హాజరైన ప్రధాని మోదీ
  • ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కిషన్‌రెడ్డి

జగిత్యాల బీజేపీ సభకు వర్షం ముప్పు?

  • సభకు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన బీజేపీ నేతలు
  • ప్రధాని మోదీ సభకు భారీ జనసమీకరణ ప్లాన్

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి జగిత్యాల బయల్దేరిన ప్రధాని మోదీ

  • జగిత్యాలలో కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభ
  • సభలో పాల్గొని ప్రసంగించనున్న ప్రధాని మోదీ
  • పాల్గొననున్న కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులు

  • ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ప్రధాని మోదీ.
  • రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో బీజేపీని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్న ప్రధాని.


ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ ఉదయం రాజ్‌భవన్ నుంచి బయలుదేరి బేగంపేట్​ఎయిర్​పోర్ట్‌కు చేరుకుని.. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జగిత్యాల వెళ్తారు.

నిన్నసాయంత్రం ఏపీ చిలకలూరిపేట జనగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రాత్రికి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బసచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement