
కల్యాణం జరిపిస్తున్న అర్చకులు
రాయికల్(జగిత్యాల): భూపతిపూర్ గ్రామంలోని లక్ష్మీనృసింహస్వామి కల్యాణం శుక్రవారం కమనీయంగా జరిపించారు. అర్చకులు గిరిధారాచార్యులు, రామకృష్ణాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. వేలాదిమంది భక్తులు కల్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రావు, ఉపసర్పంచ్ అన్నవేని వేణు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంకోజి మహేశ్, అర్చకులు వెంకటకృష్ణ, రమణ పాల్గొన్నారు.

తరలివచ్చిన భక్తులు