
ఆయిల్‌మిల్లు పరిశీలిస్తున్న లక్ష్మీనారాయణ
జగిత్యాలరూరల్: మహిళా సంఘాలు రుణాలతో ఆదా యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ సూచించారు. సంఘం సభ్యురాలు గర్వందుల భాగ్య పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా ఏర్పాటు చేసుకున్న కోల్డ్‌ఫ్రెష్ ఆయిల్ మిల్లును లక్ష్మీనారా యణ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాయితీతో కూడిన రుణాలు అందిస్తామన్నారు. ఇప్పటివరకు 66 యూనిట్లకు ప్రతిపాదనలు రాగా అందులో 24 యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యాయని తెలి పారు. ఇందులో 12 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. సెర్ప్ అధికారి వెంకటేశం, సర్పంచ్ చెరుకు జాన్, ఎంపీటీసీ నలువాల సునీత, ఉపసర్పంచ్ రఘుపతిరెడ్డి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సత్తవ్వ, వీవో అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment