
కోనాపూర్ వద్ద హైలెవల్ వంతెన పనులు ప్రారంభిస్తున్న మంత్రి ఈశ్వర్
సారంగాపూర్(జగిత్యాల): కోనాపూర్ హైలెవల్ వంతెన పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తిచేస్తేనే ప్రజారవాణాకు ఇబ్బందులు ఉండవని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోనాపూర్ శివారులో ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రూ.5.65 కోట్ల వ్యయంతో చేపట్టిన హైలెవల్ వంతెన పనులకు మంత్రి శుక్రవారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడారు. వర్షాలు ప్రారంభం కాకముందే వంతెన పనులు పూర్తిచేయాలని చెప్పారు. దీనిద్వారా మంచిర్యాల జిల్లా జన్నారం, జగిత్యాల జిల్లా సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా, అక్కడి నుంచి మంత్రి రామగుండం ఎన్టీపీసీకి వెళ్లగా.. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత రూ.86 లక్షలతో చేపట్టిన దుబ్బరాజన్న ఆలయ అభివృద్ధి, పెంబట్ల పాఠశాలలో రూ.30లక్షలతో నిర్మించిన మన ఊరు–మన బడి భవనాలు ప్రారంభించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్, ఎంపీపీ కోల జము న, జెడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, డీఈవో జగన్మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, శిలాఫలకంపై తన పేరులేదని చంద్రశేఖర్‌గౌడ్ ఆర్ అండ్ బీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.
రూ.70 కోట్లతో మన ఊరు..మన బడి పనులు
జగిత్యాల:జిల్లాలో రూ.70 కోట్ల వ్యయంతో పాఠశాలల్లో మన ఊరు.. మన బడి పనులు చేపట్టామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. స్థానిక 8వ వార్డు బుడిగజంగాల కాలనీలో మన ఊరు.. మన బడి కింద రూ.11.70 లక్షలతో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఉచిత విద్య అందిస్తున్నాం..
జగిత్యాలరూరల్:ఉచిత వైద్యం, విద్య అందిస్తూ దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి చల్‌గల్‌లో రూ.17.35 లక్షలతో చేపట్టిన మన ఊరు మన బడి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు దేశంలో పిచ్చోళ్ల రాజ్యం తయారైందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, ఉచిత విద్యుత్, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment