వెల్గటూర్(ధర్మపురి): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎండపల్లి మండలంలోని గొడిశెలపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కందికట్ల లచ్చయ్య(45) దుస్తుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా వ్యాపారం సాగకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయమై ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తన భర్త తాగుడుకు బానిసై, జీవితం మీద విరక్తి చెంది, ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్ తెలిపారు.
దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ మండలంలో ని కొల్వాయి గ్రామంలో ఓ వ్యక్తిపై దాడికి పాల్ప డిన మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై అజయ్ తె లిపారు. ఆయన వివరాల ప్రకారం.. గత నెల 31న కొల్వాయికి చెందిన శాకపురం రామచంద్రం ఇంట్లోకి అతనికి వరుసకు తమ్ముడైన శాకపురం లక్ష్మణ్ అక్రమంగా ప్రవేశించి, దాడి చేశాడు. పాత గొడవలు మనసులో పెట్టుకొని, కొట్టాడని రామచంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Published Sat, Feb 25 2023 1:40 PM | Last Updated on Sun, Feb 26 2023 5:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment