నిందితులను పట్టుకొస్తున్న ఎస్‌ఐ
చిత్తూరు,చౌడేపల్లె : మద్యం మత్తులో యువకులు చౌడేపల్లెలో బుధవారం సాయంత్రం హల్‌చల్ చేశారు. చిత్తూరు నగర సమీపంలోని తేనెబండ హరిజనవాడకు చెందిన కొందరు యువకులు వాహనాల్లో బోయకొండ గంగమ్మ దర్శనం కోసం వచ్చారు. దర్శనం అనంతరం బోయకొండ కింద విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫూటుగా మద్యం సేవించారు. బోయకొండ నుంచి చౌడేపల్లె మీదుగా చిత్తూరుకు బయలుదేరి వెళ్తుండగా చిన్నకొండామర్రి సమీపంలో అదే గ్రామానికి చెందిన సురేంద్ర, మరో మహిళ కలిసి బైక్‌మీద చౌడేపల్లెకు బయలుదేరారు. ఇదే మార్గంలో యువకులు ప్రయాణిస్తున్న టాటా సుమోకు ఎదురుగా మరో వాహనం వచ్చింది. ఈ సందర్భంలో బైక్‌ను సుమో ఢీకొనడంతో అదుపు తప్పి వాహనదారులు కిందపడ్డారు.
సుమో డ్రైవర్‌ను, ద్విచక్రవాహనదారుడు సురేంద్ర ప్రశ్నించగా వెంటనే వాహనంలోని యువకులు అతనితోపాటు మరో మహిళను దుర్భాషలాడి, దాడిచేసి గాయపరిచి పరారయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు పలమనేరు మార్గంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో సుమో వెళ్తుండగా చేజ్‌చేసి పట్టుకున్నారు. జరిగిన సంఘటన పై ప్రశ్నించిన పోలీసులు లోకేష్, మంజునాథ్‌పై వారు దాడికి యత్నించారు. కానిస్టేబుళ్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే ఎస్‌ఐ సిబ్బందితో అక్కడికి చేరుకోగా వారు పంట పొలాల వైపు పరుగులు తీశారు. ఎస్‌ఐ, సిబ్బంది వెంటాడి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొన్నారు. క్షతగాత్రులు ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. అతిగా మద్యం సేవించి హల్‌చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించి నిందితులను విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment