మానసిక రోగిని కిందకు దించేందుకు యత్నిస్తున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ) : గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 24 గంటలపాటు ఓ మానసిక రోగి చెట్టుపై కూర్చున్నాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా కిందకు దిగలేదు. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అతికష్టం మీద కిందకు దించారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మానసిక రోగి సోమవారం ఉదయం డాక్‌యార్డ్ మార్గం నుంచి సింథియా వైపు వచ్చాడు. అలా వస్తూ సింథియా మలుపు షిప్‌యార్డ్‌కు వెళ్లే మార్గంలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గంటలు గడిచినా కిందకు దిగకపోవడంతో సమీపంలోని ఆటో స్టాండ్‌లో గల డ్రైవర్లు కిందకు దించే యత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం ఉదయం స్టాండ్‌కు వచ్చిన ఆటో డ్రైవర్లకు చెట్టుపై మానసిక రోగి కనిపించడంతో మీడియా, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాపురం పోలీసులు షిప్‌యార్డ్ ఫైర్ సిబ్బంది సాయంతో రోగిని కిందకు దించారు. అనంతరం మానసిక వైద్యశాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment