
Hyderabad Metro.. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఓ యువకుడు హంగామా సృష్టించారు. మెట్రో అధికారులకు చెమటలు పట్టించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ యువకుడు మెట్రో ట్రాక్ పక్కనే ఉన్న జాలి వద్ద దాక్కున్నాడు. దీంతో మెట్రో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, సదరు యువకుడు ఎంతకీ బయటకు రాకపోవడంతో అధికారులు అతడికి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు అతడిని బయటకు తీసుకువచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి యథావిధిగా మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: పోలీసులు ఓవరాక్షన్.. అర్ధరాత్రి భార్యాభర్తలకు చేదు అనుభవం