ఏనుగుల బీభత్సం, 8 మందికి గాయాలు | 8 injured in elephants in chittoor | Sakshi
Sakshi News home page

ఏనుగుల బీభత్సం, 8 మందికి గాయాలు

Published Thu, Dec 17 2015 7:06 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

8 injured in elephants in chittoor

వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు గజరాజులు అక్కడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అయితే, అల్లికుప్పం వద్ద పంటపొలాల్లో విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మృతిచెందడంతో పాటు మరో ఏనుగుకు గాయమైంది. దీంతో ఆ స్థలానికి మరికొన్ని గజరాజులు వచ్చి ఘీంకారాలు పెడుతున్నాయి.

ఏనుగులు అల్లికుప్పం గ్రామస్తులపై దాడులకు దిగాయి. భయాందోళనలకు గురైన స్థానికులు పరుగులు ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. గజరాజుల దాడిలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement