వైరల్‌: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు! | Can You Guess How Many Elephants Are Drinking Water In This Video | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఇందులో నాలుగు ఏనుగులున్నాయి.. కాదు!

Published Fri, Jul 31 2020 8:03 AM | Last Updated on Fri, Jul 31 2020 11:32 AM

Can You Guess How Many Elephants Are Drinking Water In This Video - Sakshi

మెదడుకు పని చెప్పే ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఏనుగుల కుటుంబం కలిసి ఓ నది వద్ద నీళ్లు తాగుతున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంతలా ఇందులో ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా. ఏనుగుల ఫోటో చూసి అందులో ఎన్ని ఏనుగులు ఉన్నాయో గుర్తు పట్టాలి. ఫోటో చూసి నాలుగే ఏనుగులు ఉన్నాయి కదా అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు ఇందులో ఎన్ని ఏనుగులు ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. (వైరల్‌: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..) 

ఈ వీడియోను వైల్డ్‌లైన్స్‌ అనే యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. 70 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో నాలుగు ఏనుగులు నదిలో నీటిని తాగడం కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద ఏనుగులు కదులుతుండటంతో వాటి వెనకాల మరి కొన్ని చిన్న ఏనుగులు బయటకు వస్తుండంటంతో ఏనుగుల సంఖ్య పెరుగుతుంది. అలా చివరికి 7 ఏనుగులు అవుతాయి. నమ్మకం లేకుంటే మరి నిజంగా ఈ వీడియోలో గజరాజులు ఎన్ని ఉన్నాయో మీరు కూడా కనుక్కోండి. (వైరల్‌: బిడ్డ ప్రాణాలు కాపాడిన తల్లి ఏనుగు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement