
కర్ణాటక: మైసూరు దసరా గజరాజులకు బరువు పరీక్షలను బుధవారం చేపట్టారు. దేవరాజ మొహల్లా సాయిరామ్ తూనికల కేంద్రానికి మొత్తం 14 ఏనుగులు నడుచుకుంటూ వచ్చాయి. ఒక్కో ఏనుగును బరువు తూచారు. తూకంలో మాజీ కెప్టెన్ అర్జున అత్యధిక బరువు ఉన్న ఏనుగుగా నిలిచింది. వయసు కారణంతో దసరాలో బంగారు అంబారీని మోసే బాధ్యత అర్జునకు బదులుగా కెప్టెన్ అభిమన్యుకు అప్పగించారు.
అభిమన్యు రెండవ స్థానంలో నిలిచింది. ఏనుగులు ప్యాలెస్ నుంచి ఎంతో క్రమశిక్షణతో వరుసగా వస్తుంటే నగరవాసులు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. ఇందులో మొదటి విడతగా 9 ఏనుగులు సుమారు 3 వారాల కిందటే మైసూరుకు వచ్చాయి. వాటి బరువు అప్పటితో పోలిస్తే కొంచెం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment