ఓబులవారిపల్లె: వైఎస్ఆర్ జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వై. కోటలోకి మంగళవారం ఉదయం ప్రవేశించిన ఏనుగుల గుంపు పొలాలను ధ్వంసం చేశాయి. స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగులు గుంపు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.