శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండలంలోని మెహన్‌కాలనీ, ద్వారపాడు, బిల్లుమర, కె. గుమ్మడ గ్రామాల్లోకి ప్రవేశించిన నాలుగు ఏనుగులు జీడి, మామిడి, పనస, కొబ్బరి తోటలను ధ్వంసం చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఏనుగుల సంచారాన్ని గుర్తించిన స్థానికులు వాటిని అడవిలోకి తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు.