ఏనుగుల బీభత్సం: గ్రామాలు ఖాళీ | elephants attacks on fields in vizianagaram district | Sakshi
Sakshi News home page

ఏనుగుల బీభత్సం: గ్రామాలు ఖాళీ

Published Sat, Dec 26 2015 11:03 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

elephants attacks on fields in vizianagaram district

విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని ఎగువగుండంలో శనివారం తెల్లవారుజామున ప్రవేశించిన ఏనుగుల గుంపు అక్కడి పొలాలపై పడి పంటలను నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో మొక్కజొన్న, అరటి తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఏనుగులు గుంపు గ్రామంలోకి రావడంతో గిరిజనలు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. గ్రామాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement