ఏనుగులకూ ఆధార్ కార్డు
మైసూర్: కర్నాటక ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు సరికొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతీ ఏనుగుకూ యూనిక్వీ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఆధార్) నంబర్ ను కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, దేవాలయాలకు చెందిన ఏనుగులు, దసరా ఉత్సవాల్లో పాల్గొనే ఏనుగులు ఇకపై ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధీనంలో ఉంటాయి. ఇందుకోసం ప్రతీ ఏనుగు సమాచారాన్ని ఒక మైక్రో చిప్ లో నిక్షిప్తం చేసి వాటికి అమర్చుతారు. ఏనుగుల అక్రమ రవాణా, సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బలిగిరి, బందీపూర్, నగరహోలె ల్లోని ఏనుగుల రిజర్వ్ లల్లో ఇప్పటికే ఈ విధానాన్ని అధికారులు అమలు చేశారు.