ఇప్పటి చికెన్ ప్రియుల్లో కొందరు లెగ్ పీస్లు, బ్రెస్ట్ ముక్కల్ని ఇష్టపడ్డట్టే..
ఏనుగు మాంసం ప్రియులైన 'వాళ్లు'.. దాని తలను ఇష్టంగా తినేవారు.
దాదాపు 400 కేజీల బరువుండే ఏనుగు తలలో 6.5 కేజీలుండే మెదడును తింటే మనిషికి ఎక్కడలేని శక్తి పుట్టుకొస్తుంది.
రమారమి 180 కేజీల బరువుండే ఏనుగు తొండాన్ని, 44 కేజీల చెవులను, 14 కేజీల నాలుకను కత్తితో ముక్కలు చేసి.. వీలైతే నిప్పుల్లో కాల్చి, లేకుంటే పచ్చిగానే తినేవారు.
'ఏనుగు తల' అనే దివ్యశక్తిని తమతోనే ఉంచుకుని, ఎక్కడికి వెళ్లినా వెంటతీసుకెళ్లేవారు.
అలా వారితోపాటు వేళ్లమైళ్లు ప్రయాణించి పూర్తిగా సంబంధంలేని ప్రాంతానికి వచ్చిపడ్డ ఏనుగుల పుర్రెలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.
ఆ పరిశోధనల్లో పైన మనం చెప్పుకున్నరాతియుగపు మనిషి ఆహార శైలికి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్లెన్నో వెల్లడయ్యాయి.
ఇప్పటికీ జింబాబ్వే, థాయిలాండ్ లాంటి దేశాల్లో కొందరు ఏనుగు తలను ఇష్టంగా తినడానికి వెనకున్నకారణాలు తెలిసివచ్చాయి..
డైనోసార్లు అంతరించిన తర్వాత భూమి మీద సంచరించే అతిపెద్ద జీవిగా గుర్తింపుపొందిన ఏనుగును మనిషి ఎప్పటి నుంచి తింటున్నాడు? అనే విషయంపై ఇజ్రాయెల్ కు చెందిన టెల్ అవివ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పురాతన ఆఫ్రికా ఏనుగు పుర్రెల అవశేషాలు.. ఇజ్రాయెల్, యూరప్, రష్యా లాంటి ప్రదేశాల్లో లభించడంతో ఈ పరిశోధన మొదలైంది. రాతియుగపు మనిషి వేట ఆధారంగానే జీవించేవాడని, సేకరించిన మాంసాన్ని తనతోపాటే ఉంచుకుని సంచరించేవాడన్న సంగతి తెలిసిందే. అయితే ఏనుగు పుర్రెలను వెంటపెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
ఏనుగు తల మాంసంలో ఎక్కవ కేలరీల శక్తి ఉంటుందని అనుభవం ద్వారా తెలుసుకున్న రాతియుగపు మనిషి ఆ ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తినేవాడని, పుర్రెలను తనతోనే ఉంచుకునేవాడని టెల్ అవివ్ వర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఇవ్వాళ్టి ఏనుగుల కంటే నాటి ఏనుగురు మరింత పెద్దవిగా, శక్తిమంతంగా ఉండేవని, వాటిని చంపడం నేర్చుకోకముందు.. చచ్చినవాటిని మాత్రమే మనిషి తినేవాడని పేర్కొన్నారు. ఈ మేరకు అవివ్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనా పత్రాలను వారి పరిశోధనలు ప్రఖ్యాత క్వాటెర్నరే ఇంటర్నేషనల్ జర్నల్స్ ప్రచురించింది.
ప్రస్తుత కాలంలో మనం(భారతీయులం) ఏనుగును దైవంగా బావిస్తాం. అదే థాయిలాండ్,జింబాబ్వే లాంటి దేశాల్లో మాత్రం ఏనుగు ఇప్పటికీ హాట్ డిషే. గతేడాది మార్చి 1న తన పుట్టినరోజు వేడుకల్లో అతిథులకు ఏనుగు మాంసం వడ్డించానని సాక్షాత్తు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాంబే ప్రకటించిన సంగతి గుర్తేకదా! (కొన్నేళ్ల కిందట జింబాబ్వే అటవీ ప్రాంతంలో ఏనుగు వధకు సంబంధించిన ఫొటోలివి.)
ఏనుగు మాంసంతో ఎనర్జీ!
Published Wed, Jun 22 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement