వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత | Train hit kills 3 elephants, including 2 pregnant females, in Assam | Sakshi
Sakshi News home page

వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత

Published Mon, Dec 5 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత

వేగంగా వచ్చి రైలు ఢీ.. ఏనుగులు మృత్యువాత

దిస్పూర్‌: అసోంలో దారుణం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ రైలు మూడు ఏనుగులను ఢీకొట్టింది. దీంతో అవి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. ఆ ఏనుగుల్లో రెండు గర్భంతో ఉన్నాయి. అటవీ శాఖ అధికారుల వివరణ ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత పట్టాలు దాటుతున్న ఈ ఏనుగులను కన్యాకుమారి-దిబ్రూగఢ్‌ వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది.

దీంతో అవి చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఏనుగుల్లో ఒకటి నాలుగేళ్ల నాటిదని, మరో రెండు ఏనుగులు గర్భంతో ఉన్నాయని చెప్పారు. పోస్టు మార్టం చేసి రెండు నెలల, నాలుగు నెలల పిండాలను తొలగించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో రైలు చాలా వేగంతో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement