చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిచాయి.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గడ్డూరు యానది కాలనీలో సోమవారం వేకువజామున ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. సమీపంలోని అడవి నుంచి వచ్చిన ఏనుగుల గుంపు గ్రామంపై దాడిచేసింది. ఈ సంఘటనలో మురళి కుమారుడు విజయ్(18) అనే యువకుడు మృతిచెందాడు. ఏనుగుల గుంపును తరిమేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అవి అడవిలోకి వెళ్లిపోయాయి. విషయం తెలిసిన అటవీ అధికారులు గడ్డూరు యానాది కాలనీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.