ఏనుగుపై ఊరెగుతూ పెళ్లి చేసుకుంటున్న జంట
బ్యాంకాక్ : ప్రేమికుల రోజును ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుపుకుంటుంటారు. కొన్ని చోట్ల వేడుకలు జరుపుకునే తీరు చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రాంతంలో ప్రేమికుల రోజున ఏనుగులపై జరిగే సామూహిక పెళ్లిళ్ల వేడుక కూడా అలాంటిదే. వివరాలు.. బ్యాంకాక్‌లోని ‘నాన్ నూప్ ట్రోపికల్ గార్డెన్’లో ప్రతీ ఏటా వాలెంటైన్స్ సందర్భంగా ఏనుగులపై సామూహిక వివాహాలు చేయటం ఆనవాయితీ. ఈ ఆదివారం ప్రేమికుల రోజున కూడా నాంగ్ నూచ్ ట్రోపికల్ గార్డెన్‌లో సామూహిక వివాహాలు జరిగాయి. మామూలు సమయంలో 100 జంటల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనేవి. ( ఫీల్ మై లవ్.. ఆన్‌లైన్ లవ్ జాతకం )
కానీ, కరోనా వైరస్ కారణంగా 50 జంటలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. 100 మంది వధూవరులు ఏనుగులపై ఊరేగుతూ పెళ్లి చేసుకున్నారు. గార్డెన్ అధికారులు వీరికి మ్యారెజ్ సర్టిఫికేట్లు అందజేశారు. పెళ్లి వేడుక సందర్భంగా ఏనుగుపై ఊరేగుతూ.. పటిఫట్ పాథనాన్ అనే పెళ్లి కుమారుడు మాట్లాడాడు. ‘‘ ఈ వేడుకలో పాల్గొని పెళ్లి చేసుకోవాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. ఇది కచ్చితంగా అద్భుతంగా ఉండబోతోంది’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment