
ముంబై : సాధారణంగా మనం చూసే కొన్ని వీడియోలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని జంతువులు జాతి వైరం లేకుండా ఇతర జంతువులతో,పక్షులతో హాయిగా గడిపేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇప్పటికే చాలా చూశాం. తాజాగా ఏనుగులు గుంపులోని ఒక గున్న ఏనుగు కొంగలతో ఆడుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మొత్తం 14 సెకెన్ల నిడివి ఉన్న వీడియోలో పంటచేపులో పెద్ద ఏనుగులు మేత మేస్తుండగా అక్కడే ఉన్న గున్న ఏనుగు మాత్రం కొంగలను ఆటపట్టిస్తూ గడిపింది. కొంగలను తరుముతూ అవి ఎక్కడికి వెళితే వాటి వెనకాలే గున్న ఏనుగు పరుగులు పెట్టింది. అక్కడే ఉన్న గున్న ఏనుగు తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోనూ ఐఎఫ్‌ఎస్ అధికారి సుషాంత్ నందా తన ట్విటర్‌లో షేర్ చేశారు.' ఆనందం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మనం దానిని ఎంజాయ్ చేస్తూ పోవాల్సిందే' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 8వేల మంది వీక్షించగా వేల సంఖ్యలో రీట్వీట్స్ వచ్చాయి. ' చూడడానికి చాలా క్యూట్‌గా ఉన్నావు.. కానీ వాటి మీద అడుగు పడకుండా చూసుకో' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
(టిక్‌టాక్‌ను ఉతికారేసిన వీడియో ట్రెండింగ్)
Comments
Please login to add a commentAdd a comment