
రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు: నటి
తాను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదని శాండల్‌వుడ్ నటి శ్రుతి హరిహరన్ స్పష్టం చేశారు.
ఇటీవల శ్రుతి హరహరన్ కేరళకు చెందిన డ్యాన్స్ మాస్టర్‌ను కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నట్లు ఫేస్‌బుక్‌లో వచ్చిన విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. అందరికి ఆహ్వానాలు పంపి తాను వివాహం చేసుకుంటానని, రహస్య వివాహం చేసుకోనని చెప్పారు.