
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, నటి ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జంటగా నటించిన చిత్రం తీయవన్ కులైగళ్ నడుంగా. బిగ్‌బాస్ అభిరామి, రామ్‌కుమార్ జీకే రెడ్డి, లోగు, వేల రామమూర్తి, తంగదురై, బ్రేకింగ్ స్టార్ రాహుల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీఎస్‌ఆర్ పతాకంపై జి.అరుణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ద్వారా దినేష్ లక్ష్మణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన సంబురాలు చేసుకున్నారు చిత్రబృందం.
(ఇది చదవండి: ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత)
ఇప్పటికే రిలీజైన తీయవన్ కులైగళ్ నడుంగా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర టీజర్, మోషన్ పోస్టర్, సింగిల్ సాంగ్ ఆడియో విడుదల కార్యక్రమాలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు.. దీనికి శరవణన్ అభిమన్సు ఛాయా గ్రహణం, భరత్ అసీవగన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ కాంబోలో తొలిసారిగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
(ఇది చదవండి: కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?)
It's a wrap for Aishwarya Rajesh’s upcoming crime thriller #TheeyavarKulaigalNadunga!
— Christopher Kanagaraj (@Chrissuccess) September 4, 2023
Teaser coming soon! pic.twitter.com/0VvHN8HEis
Comments
Please login to add a commentAdd a comment