Arjun Sarja To Play Villain In Mahesh Babu Starrer Sarkaru Vaari Paata - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: మహేశ్‌ని ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!

Published Tue, Jun 1 2021 2:54 PM | Last Updated on Tue, Jun 1 2021 3:08 PM

Arjun Sarja To Play Villain In Mahesh Babu Starrer Sarkaru Vaari Paata - Sakshi

మహేశ్‌బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ నటుడు, యాక్షన్‌ కింగ్‌ అర్జున్ విలన్‌గా నటించబోతున్నారని ఆ వార్త సారాంశం.

దర్శకుడు పరశురామ్ ఇప్పటికే అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. సినిమా కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఓ భారీ సెట్లో మహేశ్‌ బాబు-అర్జున్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట.  అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్‌ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది  జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement