యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు ఓ సినిమా రాబోతున్ను సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ నెం. 15న రాబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం(జూన్ 23) రామానాయడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్ కొట్టాడు.
చదవండి: తన మూవీ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్, ఏం జరిగిందంటే!
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి అర్జున్ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment