సీక్వెల్ కాదు! | Thulasi Nair Jeeva in Rangam 2 Movie | Sakshi
Sakshi News home page

సీక్వెల్ కాదు!

Published Thu, Oct 27 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

సీక్వెల్ కాదు!

సీక్వెల్ కాదు!

జీవా, తులసీ నాయర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘యాన్’. సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ దర్శకుడిగా పరిచయ మైన ఈ చిత్రాన్ని ‘రంగం -2’గా నిర్మాత ఎ.ఎన్.బాలాజీ తెలుగులోకి రిలీజ్ చేస్త్తున్నారు. సంగీత దర్శకుడు హ్యారీస్ జైరాజ్ స్వరపరిచిన పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘రంగం’ చిత్ర విజయంలో హ్యారీస్ జైరాజ్  సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికీ మంచి పాటలు కుదిరాయి. వెన్నెలకంటి సాహిత్యం అందించారు. ‘రంగం’కి ఇది సీక్వెల్ కాదు’’ అన్నారు. నాజర్, జయప్రకాశ్, ఊర్మిళ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: జస్‌రాజ్ ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement