జీవా కొత్త చిత్రం చీరు | Actor Jeeva New Film Chiru | Sakshi
Sakshi News home page

జీవా కొత్త చిత్రం చీరు

Aug 16 2019 8:42 AM | Updated on Aug 16 2019 8:51 AM

Actor Jeeva New Film Chiru - Sakshi

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్న నటుడు జీవా. ఆదిలో రామ్‌ కట్రదు తమిళ్‌ వంటి  వైవిధ్య కథా చిత్రాల్లో నటించి నటుడిగా తానేమిటో నిరూపించుకున్న నటుడు జీవా. ఆ తరువాత పూర్తి కమర్శియల్‌ కథా చిత్రాలకు మారిపోయారు. ఆ తరువాత కుటుంబ కథా చిత్రాలు, హాస్యంతో కూడిన హర్రర్‌ కథా చిత్రాల్లో నటించి సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం ఈయన సినిమాల విషయంలో వేగం పెంచారు. అవును ఈయన ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తున్నారు. జీవా నటించిన గొరిల్లా చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. బ్యాంకు రాబరీ ఇతివృత్తంతో కూడిన వినోద భరిత కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందననే తెచ్చుకుంది.

కాగా జీవా నటించిన మరో చిత్రం జిప్సీ. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. నటుడు అరుళ్‌నిధితో కలిసి కళత్తిల్‌ సందిప్పోమ్‌ అనే కమర్శియల్‌ కథా చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని ఆర్‌బీ.చౌదరి తన సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. జీవా హీరోగా నటిస్తున్న మరో చిత్రానికి రెక్క చిత్రం ఫేమ్‌ రత్నశివ దర్శకత్వం వహిస్తున్నారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరిగణేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను స్వాతంత్య్రదినోత్సవాన్ని పురష్కరించుకుని బుధవారం విడుదల చేశారు.

కాగా ఈ చిత్రానికి చీరు అనే పేరును ఖరారు చేశారు.ఆ పోస్టర్‌లో చాలా సీరియస్‌గా ఉన్న జీవా ఫొటోను చూస్తుంటే చీరు చిత్రం పూర్తిగా కమర్శియల్‌ అంశాలతో కూడిన మాస్‌ కథా చిత్రంగా ఉంటుందని అనిపిస్తోంది. చీరు చిత్ర పోస్టర్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సోషల్‌ మీడియాలో గంటల వ్యవధిలోనే వైరల్‌ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను యూనిట్‌ వర్గాలు వెల్లడించకపోయినా, సంగీతాన్ని డి.ఇమాన్, ఛాయాగ్రహణం ప్రసన్న అందిస్తున్నారని, చీరు చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ నిర్మించిన కోమాలి చిత్రం గురువారం తెరపైకి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement