1బంతి 4 రన్ 1వికెట్ | Tamil movie 1 Pandhu 4 run 1 wicket | Sakshi
Sakshi News home page

1బంతి 4 రన్ 1వికెట్

Published Wed, Aug 27 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

1బంతి 4 రన్ 1వికెట్

1బంతి 4 రన్ 1వికెట్

 క్రికెట్ క్రీడ నేపథ్యంతో 1బంతి 4 రన్ 1 వికెట్ పేరుతో నూతన చిత్రం తెరకెక్కుతోంది. రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హెచ్ ఎన్ గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు వినయ్‌కృష్ణ హీరోగాను, హాసికదత్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో శ్రీమాన్, జీవా తదితరులు నటిస్తున్నారు. వీర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ అర్ధరాత్రి ఇండియా - పాకిస్థాన్ మధ్య చివరి క్రికెట్ పోటీని స్నేహితులు టీవీలో చూస్తుంటారన్నారు.
 
 చివరి బంతికి నాలుగు రన్స్ తీస్తే ఇండియా విజయం లాంటి ఉత్కంఠభరిత తరుణంలో అనూహ్యంగా ఒక సంఘటన జరుగుతుందన్నారు. క్రికెట్‌కు సంబంధించిన ఆ సంఘటన ఏమిటన్నది సస్పెన్స్ అన్నారు. ఇది క్రికెట్‌కు సంబంధించిన చిత్రం కాకపోయినా క్రికెట్ సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఎవరికి చెడు చేయని దెయ్యం చిత్రం అని తెలిపారు. ఆ దెయ్యానికి క్రికెట్ క్రీడకు సంబంధించిన ఆశలుంటాయని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నమే 1 బంతి 4 రన్ 1 వికెట్ చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. ఇది హాస్యంతో కూడిన హర్రర్ చిత్రం అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement