Vinay Krishna
-
దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్‌ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్‌ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
కరోనా: జిల్లాలో ఒకే రోజు ఆరు పాజిటివ్ కేసులు
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో ఈ రోజు(సోమవారం)కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది. వీరిలో సూర్యపేట పట్టణానికి చెందిన ఇద్దరితోపాటు, కుడకుడలో వచ్చిన వ్యక్తి బంధువులు.. నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన 6గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సుమారు 14 వార్డుల్లో రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, సామాజిక దూరం పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. (పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్) కాగా నిర్మల్‌లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40 మంది రక్త నమూనాలు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపగా.. వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. తాజాగా పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులు గత నెలలో ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు, కరోనా మహమ్మారీతో ఇప్పటికే జిల్లాలో ఒకరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 97 మంది శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా 22 మందికి సంబంధించిన శాంపిళ్లను పరీక్షించాల్సి ఉందన్నారు. (కరోనా: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళం) -
అందాల ఆరబోతకు సిద్ధమే
పోరాడి గెలవడంలో ఉండే కిక్కే వేరు. అలాంటి సంతోష సాగరంలో మునిగిపోతున్నారు నటి హాశిక. అందుకు కారణం నటిగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల విడుదలైన 1 బాల్ 4 రన్ 1 వికెట్ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ రెండు షేడ్స్ గల పాత్రను పోషించారు. నవ నటుడు వినయ్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొంది ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనంద డోలికల్లో తేలిపోతున్న హాశికతో చిన్న ఇంటర్వ్యూ. తొలిసారిగా హారర్ చిత్రంలో నటించినట్లున్నారు? ఈ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం. అంతేకాదు తొలి విజయాన్ని అం దించిన చిత్రం కూడా ఇదే. 1 బంతు 4 రన్ 1 వికె ట్ చిత్రంలో నాది చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర. నవ వధువుగా, దెయ్యంగా రెండు కోణాల్లో సాగే పాత్ర. ఏ పాత్రల్లో నటించడం కష్టం అనిపించింది? నిజం చెప్పాలంటే రెండు పాత్రలూ కష్టం అనిపించాయి. ఎందుకంటే చిత్ర కథ ఈ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్రల్లో పోషించడం నాకు ఛాలెంజ్‌గా మారిందనే చెప్పాలి. దెయ్యం అంటే భయమా? దెయ్యం అంటే భయపడని వారుం టారా? నా వరకు చెప్పాలంటే దెయ్యం అంటే చాలా భయం. 1 బంతు 4 రన్ 1 వికెట్ చిత్రాన్ని తొలిసారిగా తెరపై చూసినప్పుడు చాలా భయపడ్డాను. సాధారణంగా తమిళ భాష తెలియని హీరోయిన్లతో హీరోలు నటిస్తుంటారు. మరీ చిత్రంలో తమిళం భాష తెలియని హీరోతో నటించారు. కష్టం అనిపించిందా? భాష తెలియని వారితో నటించడం కొంచెం కష్టమే. అలాంటప్పుడు మూడు రోజుల్లో పూర్తి కావలసిన షూటింగ్ నాలుగు రోజులు పడుతుంది. ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడానికి థియేటర్లు చుట్టొచ్చారట? అవును. చిత్రానికి సక్సెస్ టాక్ రావడంతో ఆ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలిగింది. దీంతో చెన్నైలోని ఉదయం, ఏవీఎం రాజేశ్వరి తదితర థియేటర్లను విజిట్ చేశాను. ప్రేక్షకుల ఆదరణ బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా కిది సరికొత్త అనుభవమే. గ్లామర్ గురించి మీ అభిప్రాయం? గ్లామర్ అనేది సినిమాలో ఒక భాగం. కథకు అవసరం అయితే అందాలారబోతకు నేనురెడీ. అయితే దేనికైనా హద్దు అంటూ ఒకటుంటుంది. టూ పీస్ లాంటి దుస్తులు ధరించే ప్రసక్తే లేదు. మీకు నచ్చిన హీరోయిన్లు? మాధురీ దీక్షిత్ అంటే చాలా ఇష్టం. తమిళంలో చెప్పాలంటే కాజల్ అగర్వాల్, తమన్న, హ న్సికల నటన బాగా నచ్చుతుంది. వారి నుంచి ఒక్కొక్కరిలో ఒక్కో కొత్త విషయం నేర్చుకుంటున్నాను. చిత్ర నిర్మాణం చేపట్టే ఆలోచన ఉందట? అవును. అలాంటి ఆలోచన ఉంది. సినిమానే అంతా అని ఈ రంగంలోకి ప్రవేశించాను. అందువలన చిత్ర నిర్మాణం చేపట్టి తద్వారా పలువురు ప్రతిభావంతులైన దర్శకులను పరిచయం చేయాలనుకుంటున్నాను. -
1బంతి 4 రన్ 1వికెట్
క్రికెట్ క్రీడ నేపథ్యంతో 1బంతి 4 రన్ 1 వికెట్ పేరుతో నూతన చిత్రం తెరకెక్కుతోంది. రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హెచ్ ఎన్ గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు వినయ్‌కృష్ణ హీరోగాను, హాసికదత్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో శ్రీమాన్, జీవా తదితరులు నటిస్తున్నారు. వీర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ అర్ధరాత్రి ఇండియా - పాకిస్థాన్ మధ్య చివరి క్రికెట్ పోటీని స్నేహితులు టీవీలో చూస్తుంటారన్నారు. చివరి బంతికి నాలుగు రన్స్ తీస్తే ఇండియా విజయం లాంటి ఉత్కంఠభరిత తరుణంలో అనూహ్యంగా ఒక సంఘటన జరుగుతుందన్నారు. క్రికెట్‌కు సంబంధించిన ఆ సంఘటన ఏమిటన్నది సస్పెన్స్ అన్నారు. ఇది క్రికెట్‌కు సంబంధించిన చిత్రం కాకపోయినా క్రికెట్ సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఎవరికి చెడు చేయని దెయ్యం చిత్రం అని తెలిపారు. ఆ దెయ్యానికి క్రికెట్ క్రీడకు సంబంధించిన ఆశలుంటాయని వాటిని నెరవేర్చుకునే ప్రయత్నమే 1 బంతి 4 రన్ 1 వికెట్ చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. ఇది హాస్యంతో కూడిన హర్రర్ చిత్రం అని చెప్పారు.