డేంజరస్‌ గేమ్‌! | Preparations for release of key film | Sakshi
Sakshi News home page

డేంజరస్‌ గేమ్‌!

Published Fri, Oct 27 2017 2:22 AM | Last Updated on Fri, Oct 27 2017 2:22 AM

Preparations for release of key film

‘రంగం’ ఫేమ్‌ జీవా, నిక్కి గల్రాని, అనైనా సోఠీ ముఖ్య పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘కీ’. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలక పాత్రధారులు. కలీస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కృష్ణ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ తెలుగులో విడుదల చేస్తున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. రెండు వైపులా పదునైన కత్తిలా ఉన్న టెక్నాలజీతో ఈ రోజుల్లో ఉపయోగం ఎంత ఉందో, నష్టం కూడా అంతే ఉంది. కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి ఎదుటివారిని బెదిరిస్తుంటారు.

ఆ నష్టం ఎంతంటే ఎదుటివారు ప్రాణాలు తీసుకునేంతగా ఉంటుంది. ఇటీవల బ్లూవేల్‌ గేమ్‌ ఆడి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బ్లూవేల్‌ కంటే ప్రమాదకరమైన ఆటను మనం ఆడుతున్నాం. అదేంటో సినిమాలోనే చూడాలి. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తోంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు  సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement