కాళరాత్రికి బలైంది ఎవరు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అనేది ప్రజెంట్ సస్పెన్స్ అంటున్నారు దర్శకుడు పీఆర్ బాబు. ఆయన దర్శకత్వంలో వి.జె.వై.ఎస్.ఆర్. ఆర్ట్స్ సంస్థనిర్మించనున్న చిత్రం ‘కాళరాత్రి’. శాలినీ సింగ్ కథానాయిక. తనుజా, జి. శ్రీనివాస్, వై. శేషిరెడ్డి సహ నిర్మాతలు. ‘ఐస్‌క్రీమ్’ ఫేమ్ సత్య కాశ్యప్ స్వరకర్త. ‘‘ఈ నెల 27న షూటింగ్‌ప్రారంభిస్తాం. రాంజగన్, జీవా, జాకీ తదితరులు నటించే ఈ చిత్రంలో ఒక ప్రముఖ సీనియర్ నటి ప్రధాన పాత్రలో నటిస్తారు. ఇప్పటికి నాలుగు పాటలను రికార్డ్ చేశాం’’ అన్నారు పీఆర్ బాబు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్.
Comments
Please login to add a commentAdd a comment