ఆ అమ్మాయి కోసం... | Jeeva-Arya 'rangam modalaindi' movie in telugu | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయి కోసం...

Published Tue, Feb 25 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM

ఆ అమ్మాయి కోసం...

ఆ అమ్మాయి కోసం...

తొలి పరిచయంలోనే ఆ యువతీయువకుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు. కానీ, ఆ తర్వాత ఇద్దరూ అసలు విషయం తెలుసుకుంటారు.

 తొలి పరిచయంలోనే ఆ యువతీయువకుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు. కానీ, ఆ తర్వాత ఇద్దరూ అసలు విషయం తెలుసుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. ఆ తిట్లలోంచే ప్రేమ పుడుతుంది. కట్ చేస్తే.. మరో కుర్రాడు వీరి జీవితంలోకి ఎంటరవుతాడు? ఆ అమ్మాయి కోసం వీరిద్దరూ ఏం చేశారనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘రంగం మొదలైంది’ పేరుతో విడుదల కానుంది. జీవా, ఆర్య కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని రవితేజ సమర్పణలో అడ్డాల వెంకటరావు, వి.యం సుందరం అనువదిస్తున్నారు. 
 
 ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యువతను ఆకట్టుకునే అంశాలతో సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రం. యువన్‌శంకర్ రాజా స్వరపరచిన ఐదు పాటలూ ఆణిముత్యాల్లా ఉంటాయి. చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: రాజేష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement