rangam modalaindi
-
తిట్ల నుంచి పుట్టిన ప్రేమ
తొలిచూపులోనే ప్రేమలో పడిపోయేంత అందం ఆమెది. చూడగానే అమ్మాయిలు మనసు పారేసుకునేంత అందగాడు అతను. ఓ సందర్భంలో ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు లేనిపోని గొప్పలు చెప్పుకుంటారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని, ఖంగు తింటారు. ఒకర్నొకరు తిట్టుకుంటారు. ఆ తిట్లలోంచే ప్రేమ పుడుతుంది. కట్ చేస్తే.. మరో కుర్రాడు వీరి జీవితంలోకి ఎంటరవుతాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘రంగం మొదలైంది’ పేరుతో విడుదల కానుంది. జీవా, ఆర్య, అనుయ భగవత్, సంతానం, ఊర్వశి ముఖ్య తారలు. ఈ చిత్రాన్ని ఎ.యం. రవితేజ సమర్పణలో అడ్డాల వెంకటరావు, వి.యం సుందరం తెలుగులోకి అనువదించారు. వచ్చే నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఐదు పాటలు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: రాజేశ్. -
రంగం మొదలైయింది మూవీ ఆడియో లాంచ్
-
ఆ అమ్మాయి కోసం...
తొలి పరిచయంలోనే ఆ యువతీయువకుడు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు. కానీ, ఆ తర్వాత ఇద్దరూ అసలు విషయం తెలుసుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. ఆ తిట్లలోంచే ప్రేమ పుడుతుంది. కట్ చేస్తే.. మరో కుర్రాడు వీరి జీవితంలోకి ఎంటరవుతాడు? ఆ అమ్మాయి కోసం వీరిద్దరూ ఏం చేశారనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘రంగం మొదలైంది’ పేరుతో విడుదల కానుంది. జీవా, ఆర్య కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని రవితేజ సమర్పణలో అడ్డాల వెంకటరావు, వి.యం సుందరం అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోద ప్రధానంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. యువతను ఆకట్టుకునే అంశాలతో సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రం. యువన్‌శంకర్ రాజా స్వరపరచిన ఐదు పాటలూ ఆణిముత్యాల్లా ఉంటాయి. చంద్రబోస్ మంచి సాహిత్యం అందించారు. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: రాజేష్.