
తిట్ల నుంచి పుట్టిన ప్రేమ
తొలిచూపులోనే ప్రేమలో పడిపోయేంత అందం ఆమెది. చూడగానే అమ్మాయిలు మనసు పారేసుకునేంత అందగాడు అతను. ఓ సందర్భంలో ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది.
తొలిచూపులోనే ప్రేమలో పడిపోయేంత అందం ఆమెది. చూడగానే అమ్మాయిలు మనసు పారేసుకునేంత అందగాడు అతను. ఓ సందర్భంలో ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నట్లు లేనిపోని గొప్పలు చెప్పుకుంటారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని, ఖంగు తింటారు. ఒకర్నొకరు తిట్టుకుంటారు. ఆ తిట్లలోంచే ప్రేమ పుడుతుంది. కట్ చేస్తే.. మరో కుర్రాడు వీరి జీవితంలోకి ఎంటరవుతాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం తెలుగులో ‘రంగం మొదలైంది’ పేరుతో విడుదల కానుంది.
జీవా, ఆర్య, అనుయ భగవత్, సంతానం, ఊర్వశి ముఖ్య తారలు. ఈ చిత్రాన్ని ఎ.యం. రవితేజ సమర్పణలో అడ్డాల వెంకటరావు, వి.యం సుందరం తెలుగులోకి అనువదించారు. వచ్చే నెల 6న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఐదు పాటలు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, దర్శకత్వం: రాజేశ్.