
మిత్రద్వయం కలిస్తే ఆ కిక్కే వేరప్పా
స్టార్ మిత్రద్వయం కలిసి నటిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ కిక్కే వేరప్పా. చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హంగామా మొదలైంది.
తమిళసినిమా: స్టార్ మిత్రద్వయం కలిసి నటిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ కిక్కే వేరప్పా. చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హంగామా మొదలైంది. ఇప్పటికే ముగ్గురు స్టార్స్ కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. అందులో ఒక స్టార్ ప్రభుదేవా మోగాఫోన్ పట్టగా మరో ఇద్దరు స్టార్స్ విశాల్, కార్తీలు కథానాయకులుగా నటిస్తున్నారు. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది.
కాగా తాజాగా మరో మిత్రద్వయం ఆర్య, జీవా కలిసి నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఆర్య, జీవా మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి.వీరిద్దరూ ఒకరి చిత్రాల్లో మరొకరు అతిథిగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఇద్దరూ కలిసి నటిస్తే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నాన్, అమరకావ్యం, యమన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన జీవాశంకర్ తాజాగా తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైకా సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఇందులో నటించనున్న ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.