నయనతో బాగుందంటున్నారు! | Thirunaal Movie success meet | Sakshi
Sakshi News home page

నయనతో బాగుందంటున్నారు!

Published Mon, Aug 15 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

నయనతో బాగుందంటున్నారు!

నయనతో బాగుందంటున్నారు!

నటి నయనతారతో జోడీ బాగుంటుందంటున్నారని నటుడు జీవా పేర్కొన్నారు. ఈ జంట నటించిన తాజా చిత్రం తిరునాళ్. కోదండపాణి ఫిలింస్ పతాకంపై ఎం.సెంథిల్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్‌నాథ్ దర్శకుడు. శ్రీ సంగీతాన్ని అందించిన తిరునాళ్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరో జీవా మాట్లాడుతూ ఒక మంచి టీమ్‌కు అంతా మంచిగానే అమరిందన్నారు.
 
  తిరునాళ్ విజయానికి ఇది ఒక ప్రధాన కారణంగా పేర్కొన్నారు. కథ సగం వినగానే తనుకు బాగా నచ్చేసిందని, అప్పుడే ఈ చిత్రం చేయాలని తన మనసు చెప్పిందని తెలిపారు. ఒక మంచి టీమ్‌కు అన్నీ మంచిగానే అమరుతాయని, అదే విధంగా ఈ తిరునాళ్‌కు జరిగిందని అన్నారు. డబ్బింగ్ చెపుతున్నప్పుడు చిత్రంలో ఒక్క అనవసర  సన్నివేశం లేదనిపించిందని, అంత ఎడిటింగ్ సెన్స్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. సంగీత దర్శకుడు శ్రీతో కలిసి చేసిన మూడో చిత్రం ఇది అని తెలిపారు. శ్రీ చాలా మంచి పాటలు అందించారని కొనియాడారు.
 
  ఇక నయనతారతో తొమ్మిది సంవత్సరాల తరువాత నటిస్తున్నానని షూటింగ్ స్పాట్‌లో ఆమెను ఆట పట్టించేవాడినని చెప్పారు. నయనతార వృత్తిపై అంకిత భావం గల నటి అని కితాబిచ్చారు. అదే విధంగా నిర్మాత సెంథిల్‌కుమార్ సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థకు ఒక పిల్లర్ లాంటి వారన్నారు. ఆయన చిత్ర నిర్మాణంలో తిరునాళ్ చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం బాగుందంటూ పలువురు ఫోన్లు చేస్తున్నారని వారందరికీ ధన్యవాదాలని జీవా పేర్కొన్నారు. దర్శకుడు పీఎస్. రామ్‌నాథ్, నిర్మాత సెంథిల్‌కుమార్, సంగీత దర్శకుడు శ్రీ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement