కబాలి తరువాత తిరునాళ్ | `Thirunaal ` to release on August 5 | Sakshi
Sakshi News home page

కబాలి తరువాత తిరునాళ్

Published Thu, Jul 21 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

కబాలి తరువాత తిరునాళ్

కబాలి తరువాత తిరునాళ్

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈ నెల 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఆ తరువాత కోలీవుడ్‌లో తెరపైకి వచ్చే చిత్రం తిరునాళ్ అని తెలిసింది. యువ నటుడు జీవా,క్రేజీ తార నయనతార జంటగా నటించిన చిత్రం తిరునాళ్. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి ఈ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది.ఆ తరువాత చాలా గ్యాప్‌లో మళ్లీ కలిసి నటించిన చిత్రం తిరునాళ్. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో జీవా చాలా కాలం తరవాత పల్లెటూరి యువకుడి పాత్రలో నటించారు.
 
 నయనతార టీచర్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి రామ్‌నాథ్ దర్శకుడు. ఈయన ఇంతకు ముందు కరుణాస్ హీరోగా అంబాసముద్రపు అంబానీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తిరునాళ్ ఆయనకు రెండో చిత్రం అవుతుంది. ఈ చిత్రం కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని దర్శకుడు అంటున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ ఐదో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement