Thirunaal
-
వీడే సరైనోడు
జీవా, నయనతార జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘తిరునాళ్’ తెలుగులో విడుదల కానుంది. కోకా శిరీష సమ్పణలో నోవా సినిమాస్ పతాకంపై నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ‘వీడే సరైనోడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఏడాదికి దాదాపుగా 150 చిన్న సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి. ఈ డబ్బింగ్ చిత్రాలు పెద్ద చిత్రాలకు పునాదులు లాగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు నిర్మాత ప్రసన్నకుమార్. ‘‘సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవా నటన చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాత మోహన్ వడ్లపట్ల. ‘‘మంచి కథాంశంతో రూపొందిన చిత్రం ఇది’’ అని చిత్రనిర్మాత జక్కుల నాగేశ్వరరావు అన్నారు. -
నయన్ స్పీడుకు బ్రేక్ పడింది
వరుస సూపర్ హిట్స్ తో సౌత్‌లో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న నయనతార స్పీడుకు బ్రేక్ పడింది. గత మూడేళ్లలో పది సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటిని ఓ భారీ ప్లాప్ పలకరించింది. నయనతార, జీవా సరసన హీరోయిన్గా నటించిన తిరునాల్, గత శుక్రవారం రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ స్పీడుకు బ్రేక్ పడినట్టయ్యింది. గత మూడేళ్లలో భారీ విజయాలను అందుకున్న నయనతార.. గ్లామర్ రోల్స్‌తో పాటు మాయ, తనీఒరువన్, నానుం రౌడీథాన్ లాంటి నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కూడా ఆకట్టుకుంది. దీంతో నయన్ నటిస్తే చాలు ప్లాప్ సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు సౌత్ నిర్మాతలు. తిరునాల్ ఫ్లాప్‌తో సౌత్ ఇండస్ట్రీలో నయన్ జోరు తగ్గుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. -
మ్యూజిక్ స్టార్ బిరుదిచ్చారు
కొనుక్కునే బిరుదులు అడుక్కునే బిరుదుల కంటే అభిమానులి చ్చిన బిరుదుల్లోనే ఆనందం, మజా ఉంటుంది. అలాంటి కిక్‌లో ఉన్నా రు యువ సంగీత దర్శకుడు శ్రీకాంత్‌దేవా. ఈయన ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవా సంగీత వారసుడన్న విషయం తెలిసిందే. ఇంతకు ముం దు ఐటమ్ సాగ్స్కింగ్గా పేరొందిన శ్రీకాంత్‌దేవా ఇప్పుడు ఆల్‌రౌండర్ గా అభినందనలు అందుకుంటున్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అం దించిన తాజా చిత్రం తిరునాళ్. జీవా, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని కోదండపాణి ఫిలింస్ పతాకంపై ఎం.సెంథిల్‌కుమార్ ని ర్మించారు. పీఎస్.రామ్‌నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ ఐదో తేదీన తెరపైకి రానుంది.ఈ సందర్భంగా తిరునాళ్ చిత్రానికి పని చేసిన అనుభవాలను శ్రీకాంత్‌దేవా సాక్షితో పంచుకున్నారు. ప్ర: సంగీతదర్శకుడిగా తిరునాళ్ చిత్రానికి పని చేసిన అనుభవం గురించి? జ: తిరునాళ్ చిత్రానికి సంగీతాన్ని అందించాల్సిందిగా చిత్ర దర్శకుడు రమ్‌నాధ్,నిర్మాత సెంథిల్‌కుమార్ వచ్చి అడిగారు. కథ వినగానే ఆహా ఇది నా ప్రతిభకు మంచి పని చెప్పే చిత్రం అనిపించింది. చాలెంజింగ్‌గా తీసుకుని వెంటనే చేద్దాం. జయిద్దాం అని అన్నాను. ఈ చిత్రంలో తమిళ చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులు ఐదుగురిలో నన్ను ఒకరిగా నిలబెడుతుందనే నమ్మకంతో ఉన్నాను. ప్ర: చిత్రంలో పాటల గురించి కాస్త వివరించగలరా? జ: తిరునాళ్ చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయి. అందులో తందైయుమ్ యారో అనే పాటను ఎవరితో పాడించాలా అని ఆలోచించిగా ఎస్. జానకీ అమ్మ అయితే బాగుంటుందనిపించింది. ఎందరో ప్రఖ్యాత సం గీత దర్శకుల చిత్రాలకు పాడిన జానకీ అమ్మ ఇం దులో పాడి నన్ను అభినందించడం ఆశీర్వాదం గా భావిస్తున్నాను. అదే విధంగా హేయ్ చిన్న చి న్న పంగాలి అనే పాట ను సంగీతదర్శకుడు డి.ఇమాన్ చేత పాడించాం. ఇందులో తిట్టాదే తిట్టాదే అంటూ స్త్రీలను తిట్టకూడదని చెప్పే పా ట చోటు చేసుకుంది. ఈ పాటను నటుడు కరుణాస్ భార్య క్రేస్తో పాడించాం. విశేషం ఏమిటంటే వీటిలో నాలుగు పాటల్ని చిత్ర దర్శకుడు పీఎస్.రామ్నాథ్నే రాశారు. ప్ర: సంగీతదర్శకుడు గంగైఅమరన్ కూడా ఒక పాట పాడారటగా? జ: ఆ పాటను సస్పెన్స్‌గా ఉంచుదామనుకున్నాం. మీరు అడిగారు కనుక చెబుతున్నాను. ఇందులో ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉంది. దాన్ని మా మామతో పాడిద్దామా?అని దర్శకుడిని అడిగాను. మీ మామ ఎవరూ అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. నేను సంగీత దర్శకుడు గంగైఅమరన్ను చిన్నతనం నుంచి మామ అనే పిలుస్తాను.అదే విషయాన్ని దర్శకుడికి చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఈ పాట సంగీత ప్రియులకు తీయని అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: ఇప్పుడు చాలా సెలెక్టెడ్ చిత్రాలే చేస్తున్నాను. ప్రస్తుతం నట్టి హీరోగా నటిస్తున్న బొంగు చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాను. ప్ర: సరే అభిమానులు మీకు మ్యూజిక్ స్టార్ అనే బిరుదునిచ్చారట? జ: అదా(చిరునవ్వు) జూలై 20వ తేదీన నా పుట్టిన రోజు. ఆ రోజు అభిమానులు సోషల్ మీడియాలో వారి అభిమానాన్ని నాతో పం చుకున్నారు. అప్పుడు మ్యూజిక్ స్టార్ అని బిరుదు ఇచ్చారు. ఇదేదో వినడానికి బాగుందే అని నవ్వేశాను. అది వారికి నాపై ఉన్న అభిమానానికి చిహ్నం. -
కబాలి తరువాత తిరునాళ్
రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఈ నెల 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఆ తరువాత కోలీవుడ్‌లో తెరపైకి వచ్చే చిత్రం తిరునాళ్ అని తెలిసింది. యువ నటుడు జీవా,క్రేజీ తార నయనతార జంటగా నటించిన చిత్రం తిరునాళ్. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి ఈ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్నే సాధించింది.ఆ తరువాత చాలా గ్యాప్‌లో మళ్లీ కలిసి నటించిన చిత్రం తిరునాళ్. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో జీవా చాలా కాలం తరవాత పల్లెటూరి యువకుడి పాత్రలో నటించారు. నయనతార టీచర్ పాత్రను పోషించిన ఈ చిత్రానికి రామ్‌నాథ్ దర్శకుడు. ఈయన ఇంతకు ముందు కరుణాస్ హీరోగా అంబాసముద్రపు అంబానీ చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తిరునాళ్ ఆయనకు రెండో చిత్రం అవుతుంది. ఈ చిత్రం కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని దర్శకుడు అంటున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ ఐదో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.