నయన్ స్పీడుకు బ్రేక్ పడింది
నయన్ స్పీడుకు బ్రేక్ పడింది
Published Tue, Aug 9 2016 10:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
వరుస సూపర్ హిట్స్ తో సౌత్లో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న నయనతార స్పీడుకు బ్రేక్ పడింది. గత మూడేళ్లలో పది సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటిని ఓ భారీ ప్లాప్ పలకరించింది. నయనతార, జీవా సరసన హీరోయిన్గా నటించిన తిరునాల్, గత శుక్రవారం రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ స్పీడుకు బ్రేక్ పడినట్టయ్యింది.
గత మూడేళ్లలో భారీ విజయాలను అందుకున్న నయనతార.. గ్లామర్ రోల్స్తో పాటు మాయ, తనీఒరువన్, నానుం రౌడీథాన్ లాంటి నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కూడా ఆకట్టుకుంది. దీంతో నయన్ నటిస్తే చాలు ప్లాప్ సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు సౌత్ నిర్మాతలు. తిరునాల్ ఫ్లాప్తో సౌత్ ఇండస్ట్రీలో నయన్ జోరు తగ్గుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
Advertisement
Advertisement