నయనతార కూడా నోట్లో నుంచి బ్లేడ్ తీస్తుంది.. | nayanatara liked Thirunal | Sakshi
Sakshi News home page

నయనతార కూడా నోట్లో నుంచి బ్లేడ్ తీస్తుంది..

Published Sat, Nov 7 2015 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

nayanatara liked Thirunal

'తిరునాళ్' చిత్ర కథ నచ్చడంతో వెంటనే అంగీకరించారట నటి నయనతార. ప్రస్తుతం నెంబర్‌ఒన్ హీరోయిన్ ఎవరంటే నయనతారే అంటారు ఎవరైనా. తనీఒరవన్, మాయ, నానుమ్ రౌడీదాన్ చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఈ క్రేజీ నాయకి చేతిలో పలు చిత్రాలున్నాయి. అందులో ఒకటి తిరునాళ్. జీవా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎం.సెంథిల్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్.రామ్‌నాథ్ దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన చిత్ర వివరాలు తెలియజేస్తూ ఇది కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం అన్నారు.

 

రౌడీయిజం, రాజకీయం   ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. ఇందులో జీవాకు జంటగా నయనతార నటిస్తే బాగుంటుందని భావించి ఆమెకు ఫోన్‌లోనే గంటన్నర పాటు కథ వివరించానన్నారు. కథ విన్న వెంటనే యారడీ నీ మోహిని చిత్రం తరహాలో వినోదంతో కూడిన పాత్ర నచ్చిందని, నటించడానికి నయనతార అంగీకరించారని చెప్పారు. ఇందులో జీవా బ్లేడ్ అనే పాత్రలో రౌడీగా నటిస్తున్నారని, తరచూ ఆయన నోట్లో నుంచి బ్లేడ్ తీస్తుంటారని అన్నారు. ఒకసారి నయనతార కూడా నోట్లో నుంచి బ్లేడ్ తీస్తుందన్నారు. చిత్రం జనరంజకంగా ఉంటుందన్నారు. నయనతార పాఠశాల టీచర్‌గా నటిస్తున్నారని తెలిపారు. తదుపరి చిత్రాన్ని కూడా జీవా, నయనతార జంటగా నిర్మించనున్నట్లు నిర్మాత ఎం.సెంథిల్‌కుమార్ వెల్లడించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement