నయనతార జీవ జంటగా తిరునాళ్ | Nayantara, Jeeva pair up again | Sakshi
Sakshi News home page

నయనతార జీవ జంటగా తిరునాళ్

Published Sun, May 3 2015 3:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

నయనతార జీవ జంటగా తిరునాళ్

నయనతార జీవ జంటగా తిరునాళ్

టీనగర్: త్వరలో షూటింగ్ జరుపుకోనున్న తిరునాళ్ చిత్రంలో జీవ, నయనతార నటిస్తున్నారు. ఎస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ‘ఈ’ చిత్రం తర్వాత జీవా, నయనతార కలిసి నటిస్తున్న చిత్రం ‘తిరునాళ్’. కోదండపాణి ఫిలిమ్స్ అధ్వర్యంలో ఎం.సెంథిల్‌కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో గ్రామీణ యువకుడిగా జీవా నటిస్తున్నాడు.
 
 చాయాగ్రహణం మహేష్ ముత్తుసామి, సంగీతం శ్రీ సమకూరుస్తున్నారు. ఈ నెలలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు రామ్‌నాథ్ మాట్లాడుతూ కుంభకోణం పరిసరప్రాంతాల్లో జరిగే కథాంశంలో చిత్రం రూపుదిద్దుకుంటోందని, ఇందులో జీవా రౌడీగా నటిస్తున్నాడన్నారు. అయితే రౌడీయిజానికి సంబంధించిన కథ కాదన్నారు. చిత్రం స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉంటుందని, నయనతార టీచర్ పాత్రలో, హోమ్లీ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాకుండా కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయ న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement